వయసులో చిన్నవాడు వచ్చి ఐ లవ్యూ చెబితే. ..సమంత
వయసులో చిన్నవాడు వచ్చి ఐ లవ్యూ చెబితే...వాడితో ప్రేమలో పడిపోయే తిక్క తత్వం కాదు నాది. నిజజీవితంలో జెస్సీకీ, నాకూ..నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జెస్సీ క్లారిటీ లేని అమ్మాయి. జెస్సీ పాత్ర నాకు చిత్రమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. నేను పూర్తి క్లారిటీతో ఉండే అమ్మాయిని అంటోంది సమంత. ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...జెస్సీ కామ్ గోయింగ్ పర్సన్. నేను పెద్ద అల్లరి పిల్లను. జెస్సీ ట్రెడిషన్‌ను గౌరవించే అమ్మాయి. అందుకే సంప్రదాయబద్ధమైన చీరలు, చుడీదార్లు, పంజాబీలు, సల్వార్‌కమీజ్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నేను కూడా సంప్రదాయాన్ని గౌరవిస్తా. కానీ...మోడ్రెన్ గా కనిపించడానికే ఎక్కువ ఇష్టపడతా. ముఖ్యంగా "'ఏ మాయ చేసావె' చూసిన వారందరూ నన్ను కామ్ గోయింగ్ అనుకుంటారు. చక్కగా చీర కట్టుకొని బుద్ధిమంతురాలిగా అందులో కనిపించడం వల్ల ఆ భావన కలగడం సహజం. కానీ అందరూ అనుకున్నట్టు నేను కామ్‌గోయింగ్ కాదు. అల్లరితనం, పెంకితనం అధికపాళ్లలో ఉన్న అమ్మాయిని' అంటున్నారు సమంత. ఇప్పుడు చేస్తున్న 'బృందావనం' సినిమాలో అసలు సమంతా అంటే ఎంతో అందరికీ అర్థమవుతుంది' అంది సమంత.


Click it and Unblock the Notifications











