»   » మరీ కామెడీకాకపోతే ఇదీ వార్తేనా

మరీ కామెడీకాకపోతే ఇదీ వార్తేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెలబ్రెటీ స్టేటస్ వచ్చాక వారి ప్రతీ కదలికా వార్తే. మీడియా సైతం వారి వార్తలతో మోతిక్కిస్తూంటుంది. అయితే కొన్ని సార్లు ఆ వార్తలు సైతం నవ్వు తెప్పిస్తూంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంత ప్రతీ క్షణం వార్తల్లో నిలుస్తోంది. ఆమె మొబైల్ గేమ్ లో వచ్చే మార్కులు సైతం తెలుగులో నెంబర్ వన్ మీడియా సైతం ప్రచారం చేస్తోంది. దానికి ఆమె ట్విట్టర్ అప్ డేట్స్ దోహదం చేస్తోంది. తాజాగా ఆమె గురించి వచ్చిన న్యూస్ చూద్దాం.

ఇప్పుడు సమంత చూపు 'ట్రివియా బర్స్ట్‌'పై పడింది. ఈ ఆప్‌లో వర్తమాన వ్యవహారాలు, ప్రముఖ విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమంత టకీటకీమని సమాధానాలు చెప్పి మంచి మార్కులు కొట్టేస్తోంది. ''నా ట్రివియా బర్స్ట్‌లో వందకి 94 మార్కులు వచ్చాయి'' అంటూ ఓ ఫొటోని ట్విట్టర్‌లో పెట్టి ఆనందం వ్యక్తం చేస్తోంది సమంత. అంటే ఇందులోనూ సమంత ప్రథమశ్రేణిలో ఉన్నట్లే కదా అంటున్నారు.

Samantha scored a personal best at Trivia Burst

గతేడాది ఆరు సినిమాలతో బిజీబిజీగా గడిపిన సమంత ఈ ఏడాది కూడా ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది చిత్రంతో కలిసి చేసిన దర్శకుడు త్రివిక్రమ్ తో మరోసారి పనిచేయటానికి సైన్ చేసి వార్తల్లో నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి ఆమె డేట్స్ ఇవ్వటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్రివిక్రమ్,అల్లు అర్జున్ గతంలో జులాయి చిత్రం చేసారు. ఈ సారి ఈ కొత్త చిత్రం కూడా అదే స్ధాయిలో యాక్షన్..ఎంటర్టైన్మెంట్ కలిపి ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వార్తల్లోకి వచ్చినా ఆ అదృష్టం సమంతనే వరించింది. అలాగే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీప్రాసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ కెమెరా వర్క్, జులాయి నిర్మాత రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సమంత మాట్లాడుతూ....''ఈ ఏడాది కూడా వరుస షూటింగ్ లతో తీరిక లేకుండా గడపబోతున్నాను. 'ఆటోనగర్‌ సూర్య', 'మనం'తోపాటు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తున్నాను. తమిళంలో సూర్యతో 'అంజాన్‌' చేస్తున్నాను. ఇవన్నీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త కంగారుగా ఉంది. అయితే లోలోపల ఈ అవకాశం నాకే వచ్చిందనే ఉద్వేగం కూడా ఉంది'' అని పేర్కొంది సమంత.

అలాగే ...''ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో... ఈ జన్మలో ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. నా తొలి సినిమా నుంచి నా వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. నా మంచి, చెడుల విషయంలో సొంత మనిషిలా ఆదరిస్తున్నారు. మీ అండతోనే నేనీ స్థాయికి చేరుకున్నాను. నా జీవితంలో అభిమానులు ఉంటే చాలు... ఇంకేమీ అక్కర్లేదు'' అంటోంది సమంత.

English summary
Samantha tweeted: " Woo hoo take that trivia burst! My latest obsession. On to the next level."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu