»   » కోకలో కేక పుట్టిస్తున్న సమంత లుక్ (ఫోటో)

కోకలో కేక పుట్టిస్తున్న సమంత లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ సమంత అందం రోజు రోజుకు పెరుగుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ మధ్య తరచూ తన సెక్సీ ఫోటోలను సమంత తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా బయట పెడుతూ అభిమానులకు గిలిగింతలు పెడుతోంది. తాజాగా కోక(చీర)లో సమంత లుక్ ఫ్యాన్స్ మతి పోగొడుతోంది.

ఏమాయ చేసావె సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె అందం, ప్రతిభకకు తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో సమంత దశ మారింది. మూడేళ్లలో దాదాపు 20 సినిమాల్లో నటించి నెం.1 స్థానానికి ఎదిగింది.

ఆమె నటిస్తే సినిమా హిట్టే అనే సెంటిమెంటు పుట్టుకొచ్చింది. ప్రస్తుతం సమంత టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఏ స్టార్ హీరో అయినా, స్టార్ దర్శకుడు అయినా ప్రస్తుతం ముందుగా ప్రాధాన్యత ఇచ్చే మీరోయిన్ ఆమెనే. అందుకే సమంత ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లతో రెండే సినిమాల అవకాశాలు దక్కించుకుంది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేష్ బాబుతో, బృందావనం, రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో ఎన్టీఆర్‌తో చాన్స్ కొట్టేసింది.

సమంత ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించింది. ఆమె పవన్ కళ్యాణ్‌‍తో మరో సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలో మరింత మంది స్టార్ హీరోల సరసన సమంత నటించబోతోంది. కొందరైతే ఆమె డేట్స్ కోసమే ప్రత్యేకంగా ఎదురు చూస్తుండటం గమనార్హం. ప్రస్తుతం సమంత పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం', 'రామయ్యా వస్తావయ్యా', 'రభస'తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తోంది.

English summary
Hot heroine Samantha sexy pic posted by Samantha’s official page. She is looking gorgeous in her this attire and the palace ambience has added to the effect.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu