మన హద్దుల్లో మనం ఉంటేనే మంచిది: సమంత

By Srikanya

హైదరాబాద్ : తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే సమంత అని చెప్తారు. దాంతో ఆమె వెంట ఎప్పుడూ మీడియా ఉంటుంది. ఆమె ఏం చెప్పినా ఓ రేంజిలో కవరేజ్ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని,ఇంటా బయిట నటన చేయకూడదని, తనను పబ్లిక్ మాత్రమే కాక పైవాడు గమనిస్తూనే ఉంటాడని చెప్తోంది. అయినా ఎవరో సంతోషం కోసం, మరొకర్ని బాధపెట్టడం కోసం తానెప్పుడూ నటించనని, నిజ జీవితంలో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. మొత్తానికి నటన అనేది సెట్‌లోనే చేస్తానని, ఇంటికి వెళ్లాక సింపుల్‌గా ఉంటానని అంటుందీ అంటే పైనుంచి ఓ శక్తి తనను గమనిస్తుందన్న నమ్మకం ఉండబట్టే కదా అని శెలవిస్తోంది.

ఆమె మాట్లాడుతూ... మనం తప్పులు చేస్తే ఎవరూ చూడకపోయినా ఏదో శక్తి మాత్రం తప్పక చూస్తుందని, అందుకనే మన హద్దుల్లో మనం ఉంటేనే మంచిదని చెబుతోంది సమంత. ఒక్కసారి షూటింగ్ అయిపోయాక మేకప్ తీసేస్తే తాను సాధారణ అమ్మాయిలా మారిపోతానని, అక్కడ కూడా నటన చేయాలంటే తనకు నచ్చదని, కొంతమంది మేకప్ తీసేసాక కూడా నటిస్తూనే ఉంటారని చెబుతోంది. అటువంటివారిని మనం గమనించకపోయినా దేవుడు గమనిస్తాడని, అయినా వ్యక్తిగత జీవితంలో కూడా నటిస్తూపోతే, చివరికి నటనంటే బోర్ కొట్టదా అని అడుగుతోంది.

మరో ప్రక్క సమంత కూడా కొన్నాళ్ల వరకూ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండనని ప్రకటించింది. కారణం.. తమిళ, మలయాళ రంగాల్లో దృష్టి పెట్టడమే. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. 'మనం'లోనూ సమంతే కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికీ సంతకం పెట్టింది. వీటితో పుల్‌స్టాప్‌ పెట్టేసింది సమంత. కొత్త కథలు వినడం లేదు. విన్నా ఒప్పుకోవడం లేదు. ''గత మూడేళ్లుగా తెలుగు సినిమాతో మమేకమైపోయా. నటిగా నాకు భాషా బేధం లేదు. తమిళ, మలయాళ చిత్రాలనుంచీ ఆహ్వానం అందుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అందుకే తెలుగు సినిమాలకు తాత్కాలికంగా దూరం అవుతున్నా'' అంటోంది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X