నాతో ఎందుకీ డర్టీ గేమ్స్?.... హీరోయిన్ సమంత ఆవేదన!
హీరోయిన్లు అంటేనే ఎంతో సుకుమారంగా ఉంటారు. ఎండ తగిలితే కందిపోయేంత సాఫ్ట్‌గా ఉంటారు. మరి అలాంటి వారు కూడా సినిమా కథ డిమాండ్ చేసినపుడు మండుటెండల్లో, మురికిగా ఉండే వర్షంలో పని చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వారికి ఇష్టం లేకున్నా సినిమా కోసం తప్పదు. ప్రస్తుతం హీరోయిన్ సమంత అలాంటి పరిస్థితుల్లో సతమతం అవుతోంది.
Recommended Video


రంగస్థలంలో మండుటెండల్లో
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రంలో సమంత హీరోయిన్. సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయిగా, మోటైన పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం రాజమహేంద్రవరంలో మండుటెండల్లో షూటింగ్‌లో పాల్గొంది.

తమిళ సినిమాలో బిజీ
రంగస్థలం' షూటింగ్ ముగియడంతో ప్రస్తుతం సమంత విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న 'సూపర్ డీలక్స్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ప్రస్తుతం రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది. చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది.

ఇష్టం లేకున్నా తప్పడం లేదు
ఎండలో అందం కందిపోయేలా, వర్షంలో తడుస్తూ పని చేయడం అంటే సమంతకు చాలా చిరాకు. కానీ సినిమాకు కమిటైంది కాబట్టి తప్పడం లేదు. ఇంతకాలం దీన్ని ఓర్చుకున్న సమంత తాజాగా తన మనసులోని మాట బయట పెట్టింది.

సోషల్ మీడియాలో సమంత ఆవేదన
'రాజమండ్రి మండుటెండల షూటింగ్ నుండి ఇపుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో వచ్చిపడ్డాను. దేవుడా...నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్?' అంటూ ఏడుస్తున్న ఈమోజీలను జతచేసి.... సోషల్ మీడియాలో సమంత తన ఆవేదనను వెల్లగక్కింది.


Click it and Unblock the Notifications











