యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నహీరోయిన్...
ఏ మాయ చేసావె తొలి చిత్రంలో చీరకట్టులో అందాలను ఆరబోసి యూత్ ని మాయ చేసిన సమంత తాజాగా జూ ఎన్టీఆర్ సరసన 'బృందావనం" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ నటుడితో చేస్తే..పక్కనున్న వారికి కూడా మంచి పేరు, గుర్తింపు వస్తుందని అన్నారు. డాన్స్ విషయానికి వస్తే తనతో పోటీపడి డాన్స్ చేశానని చెప్పును కానీ..సమంత బాగా డాన్స్ చేసిందే..అనిపించే రేంజ్ లో చేశా అన్నారు. ఇక కాజల్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఏదిఏమైనా బృందావనం నాకు కాజల్ లాంటి మంచి ఫ్రెండ్ ని ఇచ్చింది. ఇప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత జూ ఎన్టీఆర్ కాజల్ బృందావనం ఏ మాయ చెశావే నాగచైతన్య samantha jr ntr kajal brindavanam ye maya chesave naga chaitanya


Click it and Unblock the Notifications