twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చూడకూడని చోట సమంత టాటూ.. ఎక్కడో తెలుసా..?

    |

    తన కెరీర్‌లోనే గోల్డెన్‌ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది హాట్ బ్యూటీ అక్కినేని సమంత. రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు 'ఓ బేబీ'తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో సామ్ ఫుల్ ఖుషీగా ఉంది. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది.

    భర్త పేరుతో టాటూ

    భర్త పేరుతో టాటూ

    సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు ఎవరి కంటా పడని ఓ టాటూను చూపించింది. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చిందీ సమంత. ‘‘ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

     కొద్దిసేపట్లోనే వైరల్

    కొద్దిసేపట్లోనే వైరల్

    సమంత వదిలిన ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో అటు ఆమె అభిమానులు, ఇటు నెటిజన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో కొద్ది సమయంలోనే ఈ ఫొటో వైరల్ అయిపోయింది. దీనిని అనుకూలంగా కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం సామ్ చేసిన పనికి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రైవేటు భాగంలో ఉన్న దానిని షో చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.

    గతంలోనూ హాట్ టాపిక్ అయిన టాటూ

    గతంలోనూ హాట్ టాపిక్ అయిన టాటూ

    సమంత టాటూ ఇప్పుడే కాదు.. గతంలోనూ ఒకటి హాట్ టాపిక్ అయింది. చై, సామ్ రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇద్దరి చేతిపై ఒకే రకమైన టాటూలు ఉండడం మీడియా కంట పడింది. ఇంకేముంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అన్ని మీడియా సంస్థలు వార్తలు రాసేశాయి. తర్వాత అంతా అనుకున్నదే నిజమైంది. చై, సామ్ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది.

    ‘ఓ బేబీ'తో మరో సక్సెస్

    ‘ఓ బేబీ'తో మరో సక్సెస్

    పెళ్లి తర్వాత కూడా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

    English summary
    Samantha akkineni shows a tattoo in her private place. through her Instagram account. sam said in the post she shared on Instagram that she had hidden it for a long time, but finally it is on display for everyone to see.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X