Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
చూడకూడని చోట సమంత టాటూ.. ఎక్కడో తెలుసా..?
తన కెరీర్లోనే గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది హాట్ బ్యూటీ అక్కినేని సమంత. రెండేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు 'ఓ బేబీ'తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో సామ్ ఫుల్ ఖుషీగా ఉంది. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది.
భర్త పేరుతో టాటూ
సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటోను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకు ఎవరి కంటా పడని ఓ టాటూను చూపించింది. ఎద కింది భాగంలో ఉన్న ఆ టాటూలో తన భర్త పేరు ఉందని చెప్పుకొచ్చిందీ సమంత. ‘‘ఇప్పుడు నేను ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను. (ఇప్పటి వరకు దాచుకున్న ఈ టాటూను ఇప్పుడు చూపిస్తున్నాను). నా భర్త చై అక్కినేని నా ప్రపంచం'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
కొద్దిసేపట్లోనే వైరల్
సమంత వదిలిన ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పిక్ కావడంతో అటు ఆమె అభిమానులు, ఇటు నెటిజన్స్ దీనిని తెగ షేర్లు చేస్తున్నారు. దీంతో కొద్ది సమయంలోనే ఈ ఫొటో వైరల్ అయిపోయింది. దీనిని అనుకూలంగా కొందరు కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం సామ్ చేసిన పనికి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రైవేటు భాగంలో ఉన్న దానిని షో చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ హాట్ టాపిక్ అయిన టాటూ
సమంత టాటూ ఇప్పుడే కాదు.. గతంలోనూ ఒకటి హాట్ టాపిక్ అయింది. చై, సామ్ రహస్యంగా ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో ఇద్దరి చేతిపై ఒకే రకమైన టాటూలు ఉండడం మీడియా కంట పడింది. ఇంకేముంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అన్ని మీడియా సంస్థలు వార్తలు రాసేశాయి. తర్వాత అంతా అనుకున్నదే నిజమైంది. చై, సామ్ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది.
‘ఓ బేబీ'తో మరో సక్సెస్
పెళ్లి తర్వాత కూడా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘ఓ బేబీ'తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.