కోరిక తీరింది: ప్రేమలో పడ్డ సమంత, త్వరలో పెళ్లి!
హైదరాబాద్: తెలుగులో సమంత స్టార్ హీరోయిన్. అయితే ఆమె స్వస్థలం తమిళంలో మాత్రం ఆమె పెద్ద స్టార్ కాదు. దీంతో ఆమెకు తమిళంలో పెద్దగా అవకాశాలు లేవు. కొత్త హీరోయిన్ల రాక, ఆమె రెమ్యూనరేషణ్ ఎక్కువగా ఉండటంతో తెలుగులోనూ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
ఎప్పటినుంచో తమిళంలో ఓ హిట్ కొట్టాలన్న సమంత కోరిక తాజాగా ‘కత్తి' హిట్‌తో తీరింది. దీంతోనైనా అవకాశాలు వస్తాయని ఆశగా చూస్తోంది. త్వరలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని కూడా స్టేట్‌మెంట్లు ఇస్తోంది. లవ్‌లో పడ్డానని, అతని గురించి అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానంటోంది. తన నోటి ద్వారా మాత్రం ఇంతవరకూ చెప్పకపోయినా అందరికీ తెలిసిపోయిన సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సంగతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సమంత మాట్లాడుతూ...మహా అయితే ఈ ఇండస్ట్రీలో రెండేళ్లు ఉంటాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఆ వెంటనే బిడ్డను కంటాను. ఇదంతా మాగ్జిమమ్ మూడేళ్లలోపే జరుగుతుంది. సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండదలుచుకోలేదు. నా బేబీ 15 ఏళ్ల వయసొచ్చేసరికి నేను పూర్తిగా ఈ జాబ్(నటన) వదిలేస్తాను.
తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశంలో ఇందులో ఆమెతో మరో మరో ఇద్దరు హీరోయిన్లు నిత్యామీనన్, అదా శర్మ కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











