ఆవకాయ్ బిర్యానీ డైరెక్టర్ తో సమంత, సిద్దార్థ..!

By Sindhu

'ఏ మాయచేసావె" చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కథానాయిక సమంత. ఆ చిత్రంలో జెస్సీగా ఈ ముద్దుగుమ్మ చూపిన ఆభినయానికి కుర్రకారంతా ఆమె మాయలో పడిపోయారు. తొలిచిత్రంలో చీరకట్టుతో మురిపించిన సమంత ఆ తర్వాత 'బృందావనం"లో మోడ్రన్ దుస్తులతో, మోర్ గ్లామరస్‌ గా కనిపించి యువతను ఆకర్షించారు. ఇక ప్రస్తుతం ఈ తార మహేష్‌ తో కలిసి 'దూకుడు" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా తన పాత్ర తొలి రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుందని, తన పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తన సన్నిహితులతో చెబుతున్నారట సమంత.

అయితే ఈ క్రేజీగర్ల్ ఈ సినిమాలో కూడా హాట్ హాట్‌గా కనిపించబోతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్‌ ను పూర్తిచేయాలని భావించిన ఈ అందాల సుందరి త్వరలో లవర్ బాయ్ సిద్ధార్థ్ తో కలిసి ఓ చిత్రంలో జతకట్టనుందని తెలిసింది. ఇంతకు ముందు 'ఆవకాయ్ బిర్యానీ" చిత్రాన్ని తెరకెక్కించిన అనీష్ కురువిల్లా ఈ చిత్రానికి దర్శకుడు. వైజాగ్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడికానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X