హీరోయిన్ సమంత కొత్త బ్రాండ్...న్యూట్రోజీనా
హైదరాబాద్: హీరోయిన్ సమంత వరుస అవకాశాలతో దూసుకెళ్లడంతో పాటు పలు కార్పొరెట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో కొత్త బ్రాండ్‌కు ప్రచారం చేయబోతోంది. న్యుట్రోజీనా అనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం ప్రచారం చేయబోతున్నట్లు సమంత తన సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నారు.
ప్రస్తుతం సమంత 'రభస' షూటింగులో బిజీగా గడుపుతోంది. జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు ఆమె వివి వినాయక్ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆడియోకూడా విడుదలైంది.

ఇక సమంత నటించిన 'మనం' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆమె నాగ చైతన్యకు జోడీగా నటించింది. అయితే నాగ చైతన్య-సమంత జోడీగా నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.
తెలుగులో త్వరలో తివిక్రమ్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేయబోతున్నారు. ఇక తమిళంలో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతున్న 'అంజాన్' చిత్రం కాగా, మరొకటి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'కత్తి' చిత్రం. దీంతో పాటు విజయ్ మిల్టన్ ప్రాజెక్టులోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











