సమంతది ముసలి ముఖం అన్న సీనియర్ నిర్మాత.. దిమ్మతిరిగేలా రిప్లై ఇచ్చిన సామ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది బ్యూటిఫుల్ సమంత. మొదట్లో గ్లామర్ పాత్రలు చేసి అదరగొట్టిన సమంత ఇటీవల కాలంలో మాత్రం ఎక్కువగా హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. అందుకు ఉదాహరణలే గతేడాది వచ్చిన యశోద.. ఈ సంవత్సరం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాకుంతలం. త్వరలో సిటాడెల్ అనే ఇండియన్ వెర్షన్ హాలీవుడ్ వెబ్ సిరీస్ తో అలరించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ సీనియర్ నిర్మాతపై సెటైర్లు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అగ్ర హీరోలకు జోడీగా
అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో ముద్దుగుమ్మ సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. దీని తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తీవ్ర నెగెటివిటీ
ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ వస్తోంది. ఇందులోని గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
క్లోజింగ్ దశకు
అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్, కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించిన ఈ మూవీపై ఘోరంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన కలెక్షన్లతో దాదాపుగా క్లోజింగ్ దశకు చేరుకుంది.

లండన్ లో సామ్
ప్రస్తుతం ముద్దుగుమ్మ సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత యాక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు లండన్ లో ప్రీమియర్ షోలు వేశారు. ఇందులో భాగంగానే సమంత లండన్ కు వెళ్లింది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇండియాకు వచ్చిన తర్వాత సిటాడెల్ షూటింగ్ లో పాల్గొననుంది.
చీప్ ట్రిక్స్
ఇదిలా ఉంటే మోస్ట్ బ్యూటిఫుల్ సమంతపై సీనియర్ నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. సమంత కెరియర్ ముగిసిపోయిందని, ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసేకునేందుకు ఆస్పత్రిలో ఉన్నట్లుగా, ఆరోగ్యం బాగా లేదని చెబుతూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని చిట్టిబాబు అన్నారు. అంతేకాకుండా తను ఇప్పుడు అందంగా లేదు, ఆమెది ముసలి ముఖం అంటూ తదితర కామెంట్స్ చేశాడు చిట్టిబాబు.

చెవిలో వెంట్రుకలకు
అయితే తాజాగా చిట్టిబాబుపై తనదైన స్టైల్ లో సెటైర్ వేసింది ముద్దుగుమ్మ సమంత. ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేసింది. అందులో వ్యక్తుల చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ లో సెర్చ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఇలా చెవులలో నుంచి వెంట్రుకలు బయటకు రావడానికి టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండటం వల్ల అని ఉంది. దీనికి 'ఇఫ్ యు నో.. యు నో' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కాగా నిర్మాత చిట్టిబాబుపైనే ఇన్ డైరెక్ట్ గా సామ్ సెటైర్ వేసిందని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











