ఆ హీరోయిన్ కి మహేష్ తో రొమాన్స్ చేయడానికి అతని అందమే అడ్డునా...
మహేష్ బాబు సరసన సమంత హీరోయన్ గా చేస్తున్న ఈ 'దూకుడు"ని 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిక్, బృందావనం ఫేం తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ యూనిట్ టర్కీ వెళ్ళింది. అక్కడ ఈ షూటింగ్ చప్పగా సాగిందట. మహేష్, సమంత ఏ మాత్రం ఒకరికొకరు మాట్లాడుకోవడంగానీ, జోకులేసుకోవడంగానీ చేయలేదట. కేవలం సీన్ చెప్పగానే యాక్ట్ చేసి తిరిగి తమ స్థానాల్లోకి వెళ్ళిపోయి ఎవరి పనులు వారు చేసుకునేవారట. దాంతో ఈ షూటింగ్ అంతా చాలా చప్పగా సాగిందని తెలుస్తోంది. ఇంత ముభావంగా ఉండే ఈ ఇద్దరి మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ అసలు పండుతాయా? లేదా అని దర్శకుడు ఫీలవుతున్నట్టు సమాచారమ్. ఇలాగే ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోతే రొమాన్స్ సీన్స్ చప్పగా ఉంటాయని యూనిట్ కూడా భావిస్తోందట.
కాగా ఆ మద్య ఒక సందర్భంలో సమంత మీడియాతో మాట్లాడుతూ 'ప్రస్తుతం మహేష్‌బాబుతో 'దూకుడు" చిత్రంలో నటిస్తున్నాను. ఆయనతో కలిసి నటించాలంటే నాకు కొంచెం భయం వేస్తోంది. ఎందుకో తెలుసా…? ఆయన అందం ముదు తేలిపోతానేమో అని భయం. నిజంగా అందగాడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే మహేష్‌బాబు అనొచ్చు. అందుకే ఆయనంటే అమ్మాయిలు అంతగా ఇష్టపడతారు అని ప్రిన్స్ ని తెగ మోసేసింది. బహుషా సమంతాయే మహేష్ బాబుకి సెట్స్ లో కోఆపరేట్ చేయలేదేమోనని మరికొందరు భావిస్తున్నారు..


Click it and Unblock the Notifications











