ఈ ఇండస్ట్రీలో చాలా కష్టం, మా ఫ్యామిలీ పేరు నిలబెడతా: సమంత అక్కినేని

స‌మంత అక్కినేని ప్రధాన పాత్రలో నందీని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మించారు.

సమంతతో పాటు ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, తేజ, ప్రగతి ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమంత తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

ఈ ఇండస్ట్రీలో అలాంటివి అసాధ్యం, కానీ...

ఈ ఇండస్ట్రీలో అలాంటివి అసాధ్యం, కానీ...

ముందు నేను ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంత మంచి కెరీర్ ఇచ్చింది మీరే. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మౌంట్ చేయడం ఈ ఇండస్ట్రీలో చాలా కష్టం. దాదాపు అసాధ్యం. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నన్నునమ్మి తీశారంటే అది కేవలం మీ సపోర్ట్ నాకు ఉండటం, మీరు నన్ను అలాంటి పొజిషన్ల పెట్టడం వల్లనే. అభిమానులు లేకుంటే నేను నథింగ్. నా కెరీర్లో మరో బెస్ట్ ఫిల్మ్ చేయడానికి సపోర్ట్ ఇచ్చినందుకు మరోసారి థాంక్స్.

ఈ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకుంది

ఈ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకుంది

ఈ కథను మేము సెలక్ట్ చేసుకున్నాం అనడం కంటే ఆ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకున్నట్లు ఉంది. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సంతోషం ఇచ్చింది. ఛాలెంజ్‌గా చేసేలా చేసింది. నా సినిమా గురించి నేను మాట్లాడటం కాస్త సిగ్గుగా ఉంది. జులై 5 తర్వాత ఇంకా మాట్లాడుకుందాం.

నా కెరీర్ బెస్ట్ రోల్ ఇదే

నా కెరీర్ బెస్ట్ రోల్ ఇదే

ఇందులో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేశాను. ఇది నా కెరీర్ బెస్ట్ రోల్ అని చెప్పగలుగుతున్నానంటే అది నా టీమ్ వల్లే సాధ్యమైంది. అద్భుతమైన టీమ్ ఈ సినిమాకు దొరికింది. డైరెక్టర్ నందిని గారు ఒక అక్కయ్య మాదిరిగా నన్ను చూసుకున్నారు. ఆమెను నేను పూర్తిగా నమ్మాను. ఆ నమ్మకం నా పెర్ఫార్మెన్స్ లో తెలుస్తుంది.

ఆయన మా సినిమాకు గోల్డ్

ఆయన మా సినిమాకు గోల్డ్

రాజేంద్ర ప్రసాద్ గారు నాకు కామెడీ నేర్పించారు. ప్రతి సీన్ ఎలా చేయాలో చెప్పారు. లక్ష్మీగారు లెజెండరీ యాక్టర్, ప్రగతిగారు, రావు రమేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో భాగం అయినందుకు నాగ శౌర్యకు థాంక్స్. ఆయన మా సినిమాకు నిజంగా గోల్డ్. సెకండాఫ్ లో హైలెట్ అయ్యేది ఆయన పాత్రే. తేజ, సునైనా, స్నిగ్ద, హేమంత్ తదితరులు అందరూ చాలా బాగా చేశారు.

మా ఫ్యామిలీ గర్వ పడేలా చేస్తా

మా ఫ్యామిలీ గర్వ పడేలా చేస్తా

నిర్మాతలు సురేష్ బాబు సర్, సునీత తాటిగారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. సురేష్ బాబు సర్ ఇంతకు ముందు ప్రెస్ మీట్లో చెప్పారు ఫస్ట్ టైం రామానాయుడు ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వస్తోంది అని.. ఆ మాట కోసం నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆయన గర్వపడేలా చేయాలి. మా కుటుంబం మాత్రమే కాదు... మీరంతా జులై 5న గర్వపడే విధంగా సినిమా ఉంటుంది. మేము ఇక్కడ నిలబడి సినిమా బావుంది.. రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టర్ చూసిన వెంటనే ఈ సినిమాలో నిజాయితీ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది. మీరు కచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరని నేను మాటిస్తున్నాను... అని సమంత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X