Samantha: నాగ చైతన్యకు దిమ్మ తిరిగేలా సమంత కౌంటర్? ఆ మూడే అంటూ షాకింగ్ పోస్ట్!

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి అందరినీ మాయ చేసిన ముద్దగుమ్మ సమంత. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ అందుకున్న ఈ సుందరి ఆ తర్వాత అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది సమంత. అయితే ఇటీవల సమంతతో విడాకులపై నాగ చైతన్య అసలు కారణం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై చైతూ కౌంటర్ ఇచ్చినట్లుగా కామెంట్స్ చేసింది సామ్.

25 ఏళ్ల కెరీర్ లో: ప్రస్తుతం వరుసగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న సమంత ఇటీవల శాకుతంలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ రాగా దిల్ రాజ్ 25 ఏళ్ల కెరీర్ లో పెద్ద ఝలక్ అని చెప్పి షాక్ ఇచ్చాడు.

Samantha

తర్వాతి ప్రాజెక్ట్సుపై:ఎన్నో ఆశలు పెట్టుకున్న శాకుంతలం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోగా త్వరలో ఓటీటీలోకి రానుంది. మే 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఓటమితో నిరాశ చెందని సమంత తర్వాతి ప్రాజెక్ట్స్ పై ఫుల్ ఫోకస్ పెడుతోంది. విజయ్ దేవరకొండతో సమంత ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇందులో నుంచి విడుదలైన సామ్ పోస్టర్ ఆకట్టుకుంది.

వారానికొకటి చొప్పున: ఖుషీ మాత్రమే కాకుండా హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో గ్లామరస్ బ్యూటి సమంత నటించనుంది. ప్రియాంక చోప్రా చేసిన పాత్రను సామ్ చేయనుంది. అయితే ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్ నుంచి ఇప్పటికీ మూడు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల అయ్యాయి. మరో 3 ఎపిసోడ్స్ ను అమెజాన్ ప్రైమ్ వారానికొకటి చొప్పిన రిలీజ్ చేయనుంది.

Samantha:

అసలు నిజాన్ని: ఇదిలా ఉంటే సమంత పర్సనల్ విషయానికొస్తే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్ విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లు విడిపోవడానికి అసలు కారణం ఎవరూ సరిగా చెప్పలేదు. ఇటీవలే సమంత లవ్లీ ఉమెన్, ఆమె ఆనందానికి అర్హురాలు, మీడియా కారణంగానే గొడవలు జరిగాయని నాగ చైతన్య అసలు నిజాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Samantha

కేవలం నమ్మకం: ఇప్పుడు తాజాగా నాగ చైతన్య వాఖ్యలపై సమంత స్పందించినట్లుగా ఆమె లేటెస్ట్ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. "మనమంతా ఒక్కటే. కేవలం ఇగోలు, నమ్మకాలు, భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి" అని కొటేషన్ రాసి ఉన్న పోస్ట్ షేర్ చేసింది సామ్. తర్వాత "జీవితం నిన్ను ఛాలెంజ్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఇలా ఉండాలి" అని రాసి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్టులు నాగ చైతన్యకు కౌంటర్ గానే ఉన్నాయని, అతనికి దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చిందని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X