సమంతపై ఆసభ్యకరమైన ట్వీట్: చెడిపోయి 50 కోట్లు తీసుకుంది అంటూ ఘోరంగా.. సామ్ అలా రిప్లై చేయడంతో!
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది సమంత. ఆరంభంలోనే తన నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. అందంతో ఎంతో మందిని ఫిదా చేసేసింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తూ వచ్చింది. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే సామ్.. అక్కినేని యువ హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత కొన్నేళ్లకు అంటే ఈ ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంది. దీంతో ఈ స్టార్ హీరోయిన్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ సమంతపై అభ్యంతకర ట్వీట్ చేశాడు. దీనిపై ఆమె స్పందించి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
Recommended Video

నాగ చైతన్యతో ప్రేమ వివాహం
నాగ చైతన్య.. సమంత కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత 'మనం' సినిమా సమయంలో నాగార్జునకు ఈ విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత జంటగా సందడి
పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య లైఫ్‌ను ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య - సమంత కలిసి 'మజిలీ' అనే మూవీ చేశారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

విడాకులు తీసుకున్న చైసామ్
టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన జంటగా గుర్తింపును తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. తామిద్దరం విడాకులు తీసుకోనున్నట్లు చైతన్య, సమంత శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వాళ్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఎవరి కెరీర్‌లతో వాళ్లు బిజీగా
విడాకులు తీసుకున్న తర్వాత అటు నాగ చైతన్య.. ఇటు సమంత ఎవరి కెరీర్‌లతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన వీళ్లిద్దరూ.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైతూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒప్పుకుంటున్నాడు. అలాగే, సామ్ ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌తో పాటు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐటెం సాంగ్ రచ్చ.. ట్రోల్స్‌తో
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత స్వాతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో ఆమె అందాల విందు చేసింది. ఈ పాటకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. కానీ, కొందరు మాత్రం సామ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

సామ్‌పై అసభ్యకరమైన ట్వీట్
విడాకుల తర్వాత సమంతను చాలా మంది ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా నాగ చైతన్య దగ్గర భరణం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ నెటిజన్ 'సమంత విడాకులు తీసుకుని చెడిపోయిన సెకెండ్ హ్యాండ్ ఐటమ్. ఆమె ఓ జెంటిల్మన్ దగ్గర యాభై కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా తీసుకుంది' అంటూ అసభ్యంగా ట్వీట్ చేశాడు.

సమంత రిప్లైతో ట్వీట్ డిలీట్
ఆ నెటిజన్ చేసిన ట్వీట్ సమంత దృష్టికి చేరింది. దీంతో అతడి పేరును ప్రస్తావిస్తూ 'నీ ఆత్మకు ఆ దేవుడి దీవెనలు ఉండాలి' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దీంతో వెంటనే సదరు నెటిజన్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు. ఇక, సామ్ రిప్లైకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. నటుడు బ్రహ్మాజీ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











