»   » పుట్టబోయే బిడ్డ గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్!

పుట్టబోయే బిడ్డ గురించి సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుకలో 'అ..ఆ' చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత కెరీర్లో ఇది 4వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్.

అవార్డు ఫంక్షన్‌కు వచ్చే ముందు సమంత కాస్త టెన్షన్ పడుతూ నెర్వస్‌గా కనిపించిందట. అవార్డు తీసుకోవడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? అని నాగ చైతన్య అడిగితే సమంత ఆసక్తికర సమాధానం చెప్పింది.

నా బిడ్డలు నా గురించి అడిగితే ఇవే చూపిస్తాను

నా బిడ్డలు నా గురించి అడిగితే ఇవే చూపిస్తాను

‘రేపు నాకు పుట్టబోయే బిడ్డలు.... నాన్న పెద్ద స్టార్, మరి నువ్వు ఏమిటని అడగితే వాళ్లకు నేను గెలుచుకున్న ఈ అవార్డులు చూపిస్తాను. నటిగా ఈ అవార్డులు తీసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాను' అని సమంత తెలిపింది.

పిల్లలంటే ఎంతో ఇష్టం

పిల్లలంటే ఎంతో ఇష్టం

సమంతకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నాగ చైతన్యతో వివాహం తర్వాత వీలైనంత త్వరగా పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అక్టోబర్ 6న సమంత, నాగ చైతన్య వివాహం జరుగబోతున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం?

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం?

పెళ్లి తర్వాత సమంత సినిమాలకు దూరం అవ్వాలా? లేక కొనసాగాలా? అనే విషయంలో నా ప్రమేయం ఏమీ ఉండదని, తనకు ఏది నచ్చితే అది చేస్తుందని చైతన్య ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే సమంత మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

సమంత

సమంత

సమంత సినిమాలు, పర్సనల్ లైఫ్, చైతూతో వివాహం ఇలా

మరిన్ని విశేషాల సమాహారం క్లోసం క్లిక్ చేయండి.

    English summary
    Samantha Ruth Prabhu walked to the stage of Filmfare Awards to receive her fourth Black Lady for Best Actress performance, she made some stunning comments. Naga Chaitanya questioned her why she's so anxious about getting the award. Do you know what Sam said then? "Tomorrow when our baby asks me, 'Dad is a big star what about you?' then I could show these trophies", said Samantha.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu