»   » మగరాయుడిలా సమంత, డ్రెస్ చూసి అంతా ఆశ్చర్యం...

మగరాయుడిలా సమంత, డ్రెస్ చూసి అంతా ఆశ్చర్యం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సమంత ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని ఓ డిఫరెంట్ అవతారంలో దర్శనమిచ్చారు. బాహుషా సమంత లైఫ్ లో ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఇదే తొలిసారి అయి ఉంటుంది. సమంత పంచెకట్టులో ఉన్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

నటుడు రావు రమేశ్‌తో కలిసి సమంత ఉన్న ఆ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫొటో ఏ సినిమాకు సంబంధించినది అనేది మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం సమంత రెండు తెులుగు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఏదో ఒక సినిమాకు సంబంధించినది అని భావిస్తున్నారు.

Samantha stunning look in Panche Kattu

సమంత ఇపుడు నాగార్జున హీరోగా తరకెక్కుతున్న 'రాజుగారి గది-2' సినిమాతో పాటు.... సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

పంచెకట్టు అంటే పల్లెటూరి నేపథ్యం కాబట్టి ఈ ఫోటో సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించినది కావొచ్చు అని భావిస్తున్నారు.

    English summary
    Samantha stunning look in Panche Kattu. She has given pose with veteran actor Rao Ramesh and both are in traditional outfit. She looks perfect in this traditional panche kattu attire.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu