twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదృష్టం కలిసివచ్చింది అంతే: సమంత

    By Srikanya
    |

    ఇది తాత్కాలికం మాత్రమే...ప్రతీ శుక్రవారం నంబర్స్ మారిపోతూంటాయి. ఇక్కడ చాలామంది తెలివైన,టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు.వాళ్లకి మంచి అవకాసం వస్తే ప్రూవ్ చేసుకుంటారు.నేను అదృష్టవంతురాల్ని రైట్ టైమ్ లో రైట్ ప్రాజెక్టులు పడ్డాయి. నా సక్సెస్ కు కారణం ట్యాలెట్ ఒక్కటే కాదు...డెస్టినీ కూడా అంది సమంత. ఆమెను మీకు నెంబర్ వన్ స్టేజీకి వెళ్లామని భావిస్తున్నారా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇలా స్పందించింది.అలాగే ప్రస్తుతం సమంత తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ...రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలు రెండూ తమిళ,తెలుగులో ఒకేసారి విడుదల అవుతాయి. రెండింటిలోనూ నానినే హీరో. అలాగే సిద్దార్ధ,నాగచైతన్య,మహేష్ బాబు సరసన ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని వినపడుతోంది అంటే...ఫస్ట్ డే షూట్ అయితే కానీ నేను ఏ సినిమానూ నా చేతిలో ఉందని చెప్పలేను అంది. నాకు అటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయని తెలివిగా సమాధానం చెప్పింది.

    ఇక ఎన్టీఆర్ గురించి చెప్తూ అతనూ గొప్ప నటుడే కాక మంచి హ్యూమన్ బీయింగ్ అంది. అతని తో మళ్లి చేయాలని కోరుకుంటున్నాను అంది. ఇక తను పనిచేసిన ఎన్టీఆర్,మహేష్,నాగచైతన్య లు ఫేవరెట్ స్టార్సే అయనప్పటికీ నాగచైతన్యే నాకు బాగా క్లోజ్ అంది. ఇక దూకుడులోని తన పాత్రను తాను చాలా ఎంజాయ్ చేసానని చెప్పింది. నాకు షూటింగ్ మొదటి రోజు నుంచి తెలుసు దూకుడు చిత్రం మొత్తం మహేష్ కేంద్రంగా జరిగే కథ అని అందుకే ఏ సమస్యా రాలేదు అంది. ఇక దూకుడులో ఆమె పాత్ర కేవలం డాన్స్ లకే పరిమితం అవుతుంది. సెకెండాఫ్ లో పాత్ర నిడివి తగ్గిపోతుంది. ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.

    English summary
    "It's so temporary. The numbers change every Friday. There are many intelligent and talented actresses waiting for a good opportunity. I was lucky to get the right films at the right time. My success is a mix of talent and destiny," 
 Samantha quips.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X