జ్వరంగా ఉన్నా సంతోషంగా ఉన్నా: సమంత
అలాగే... ''చిన్న పాత్ర అనిపిస్తే ఆ సినిమాపై సంతకం చేయకూడదని నిర్ణయించుకొన్నా. ఇక నుంచి నా ప్రతీ పాత్ర నన్ను బాగా ఆకర్షించాలి'' అని ట్వీట్ చేసింది. ఇప్పుడు పోషిస్తున్న పాత్రలు సమంతకి పూర్తిస్థాయిలో సంతృప్తినివ్వడం లేదా? ఇక నుంచి ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోందా? ఆమె నిర్ణయం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
మరో ప్రక్క తెలంగాణ విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సమంత నటించిన 'అత్తారింటి దారేది' చిత్రంతో పాటు, ఆమె నటించిన మరో సినిమా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కూడా ఈ పరిస్థితి కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో సమంత తనదైన రీతిలో స్పందించింది. 'ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై నేను ఏమీ మాట్లాడ దలుచుకోలేదు. నో కామెంట్' అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన చాలా మంది సమంత చాలా తెలివిగా ప్రవర్తించిందని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, సమైక్యాంధ్ర ఎటువైపు అనుకూలంగా మాట్లాడిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్తితి ఉన్న నేపథ్యంలో సమంత ఇలా తటస్థ వైఖరి ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది.
'అత్తారింటికి దారేది' సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకొంది సమంత. అయితే విజయంతో పాటు తెరపై కనిపించే విధానం కూడా కీలకమే అని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ప్రాధాన్యమున్న పూరిస్థాయి పాత్రలయితేనే సినిమా చేయాలని నిర్ణయించుకుంది. సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం అక్టోబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












