అక్కడ పవన్, తెలంగాణలో సమంతను రంగంలోకి దింపిన మంత్రి కేటీఆర్!
తెలంగాణలో కూడా చేనేతకు తగిన ప్రచారం కల్పించాలంటే సినీ స్టార్లు అయితేనే ధీటుగా ఉంటుందని భావించారో ఏమో.... సమంతను రంగంలోకి దింపారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి తెలంగాణలో కూడా చేనేతకు తగిన ప్రచారం కల్పించాలంటే సినీ స్టార్లు అయితేనే ధీటుగా ఉంటుందని భావించారో ఏమో.... సమంతను రంగంలోకి దింపారు మంత్రి కేటీఆర్.
కేటీఆర్ కోరిక మేరకు రాష్ట్ర చేనేత సహకారసంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సమంత అంగీకారం తెలిపారు. ఈ అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సమంతకు మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరను బహుకరించారు.

నాగార్జున ద్వారా?
కేటీఆర్, నాగార్జున మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయం తోనే నాగార్జున ద్వారా సమంతను ఒప్పించినట్లు సమాచారం.

అక్కడ పవన్, ఇక్కడ సమంత
ఆంధ్రప్రదేశ్ లో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో సమంతను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అయింది.

సమంత స్పందన
ఈ అవకాశం రావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

పోచంపల్లి చీర బహుమతి
ఈ సందర్భంగా సమంతకు మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరను బహుకరించారు.


Click it and Unblock the Notifications











