స్వచ్చ్ భారత్: చీపురు పట్టిన సమంత (ఫోటోస్)
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ఇందులో పాల్గొనడం, మరికొందరిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేయడం జరుగుతోంది.
గత వారం టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హైదారబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోయిన్ సమంతను నామినేట్ చేసారు. రామ్ విసిరిన స్వచ్చ్ భారత్ చాలెంజ్ స్వీకరించిన సమంత చీపురు చేతపట్టింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొంది.
హైదరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల ఆవరణను శుభ్రం చేసింది. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు స్టైలిస్ట్ కోన నీరజ, సమంత అభిమానులు కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

చీరుపు పట్టిన సమంత
హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల వద్ద చీరుపట్టి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.

చెత్త ఎత్తేసింది
తన అభిమానులతో కలిసి స్కూలు మొత్తం శుభ్రం చేయడంతో పాటు స్కూలు ఆవరణలో పేరుకుపోయిన చెత్తను ఎత్తి పారేసింది.

ఇబ్బంది పడింది
సమంతకు అసలు ఇలాంటి పనులు అలవాటు లేదు కాబట్టి కాస్త ఇబ్బంది పడింది.

అభిమానులతో..
ఈ సందర్భంగా అభిమానులతో కలిసి సమంత ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

పారిశుధ్య కార్మికులతో..
పారిశుద్య కార్మికులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.


Click it and Unblock the Notifications











