జూ ఎన్టీఆర్ తో పోటీపడి మరీ డాన్స్ చేసా
ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అసలు ఈ సినిమాలో ఆయన డాన్సులే హైలైట్. ఆయన గత సినిమాలతో పోలిస్తే బృందావనం లో ఆయన డాన్స్ మరింత కొత్తగా ఉంటుంది. మా ఇద్దరిపై చిత్రీకరించిన పాటల్లో ఆయనతో పోటీపడి డాన్స్ చేశానని అందరూ అన్నారు. ఎన్టీఆర్ కూడా నా డాన్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అందులో ఎంత నిజం ఉందో ప్రేక్షకులే చెప్పాలి అని చెప్తోంది సమంత. ఏం మాయ చేసావే చిత్రం తర్వాత సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాపై ఆమెకు చాలా హోప్స్ ఉన్నాయి. ఈ విషయాన్నే ఆమె చెప్తూ...నా అందాన్ని..అభినయాన్ని మాత్రమే ఏం మాయచేసావె లో చూశారు. రేపు రానున్న బృందావనం లో నాలోని అద్భుతమైన డాన్సర్‌ని చూస్తారు అంది.
అలాగే ఈ చిత్రంలోని తన పాత్ర గురించి చెబుతూ..రియల్‌లైఫ్‌లో తన క్యారెక్టర్‌కి దగ్గరగా బృందావనం లోని తన పాత్ర ఉంటుంది అంటోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ పాత్రను గొప్పగా పోషించినంత మాత్రాన మంచిపేరు రాదు. పాత్ర పండాలంటే..తోటి నటీనటుల సహకారం కూడా కావాలి. ఈ విషయంలో ఎన్టీఆర్ సహకారం మరిచిపోలేను. ఆయన గొప్ప నటుడు. ఆయన స్థాయిని అందుకోవడానికి ఎంతో కష్టపడి బృందావనంలో చేశాను.సెట్‌లోనే ఎన్నో అభినందనలు అందుకున్నాను. తప్పకుండా ప్రేక్షకులకు కూడా నా నటన నచ్చుతుందని నమ్మకం అంది సమంత. ఇక కాజల్ కూడా ఈ చిత్రంలో మరో హీరోయన్ గా చేస్తోంది. ఆమె కూడా ఇలానే తన పాత్ర అద్బుతం అని చెప్తోంది. ఇద్దరులో ఎవరు అదరకొట్టారనే సంగతి తెలియాలంటే సినిమా రిలీజయ్యేవరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











