హాట్ స్టార్ సమంతకు ఎప్పుడూ అదే ఆలోచన
మొదటి సినిమా 'ఏ మాయ చేశావె'తోనే కుర్రాళ్ళందరినీ మాయ చేసి వారి గుండెల్లో ఫీఠం వేసుకుని కూర్చుండిపోయిన హీరోయిన్ సమంత. ఆమె తాజాగా మహేష్ సరసన దూకుడు చిత్రం చేస్తోంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సినిమా సినిమాకు నాకు బాధ్యత పెరుగుతోంది. 'ఏ మాయా చేశావె' సినిమాతో నాకు వచ్చిన ఇమేజ్‌ని కాపాడుకుంటూ భిన్న పాత్రల్లో నటించి మెప్పించాలి. ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా ఆలోచించి అంగీకరిస్తున్నా. అందులో నా నటన ఎలా ఉండాలి. ఎలా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. నటనలో మెలకువలు నేర్చుకోవడం. కో స్టార్, దర్శకుడు, నిర్మాత ఇలా అన్ని రకాలుగా ఆలోచిస్తా. ప్రస్తుతం నాకు ఎప్పుడూ అదే ఆలోచన' అంటోంది సమంత. అంత డెడికేషన్ తో ముందుకు వెళ్తేగానీ సక్సెస్ రాదని అర్దమైనట్లుంది. లేటెస్ట్ గా ఆమె గౌతమ్ మీనన్ దర్సకత్వంలో రామ్ హీరోగా రూపొందే చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











