twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బృందావనం కన్నా దూకుడు బెస్ట్ అంటోంది

    By Srikanya
    |

    నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ఏం మాయ చేసావె లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు. ఇక రెండో సినిమా బృందావనం లో ఆ అవకాశం వచ్చినా... అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ దూకుడు లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు. డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా దూకుడు . నా కెరీర్‌లో ఓ మెమరబుల్ హిట్‌గా ఈ సినిమా నిలవడం ఖాయం. టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు దూకుడు నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు అని ధీమాగా చెబుతోంది సమంత.

    త్వరలో విడుదల కానున్న దూకుడు సినిమా గురించి మాట్లాడుతూ సమంత పై విధంగా స్పందించింది. ఇక దూకుడు చిత్రాన్ని 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమైపోతున్నారు.తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

    English summary
    It is well aware that Mahesh Babu Starrer Dookudu is releasing on 23rd September with highest number of prints.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X