మహేష్ నుంచి అదే నేర్చుకున్నా: సమంత
మహేష్ బాబు గ్రేట్ కో స్టార్..అతను పూర్తిగా డైరక్టర్ మీదనే నమ్మకం పెట్టుకున్నాడు అంతేగాక దర్శకుడుకి అన్ని విధాలుగా సపోర్టు ఇచ్చాడు. అలాగే నేను మహేష్ దగ్గరనుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే ప్రతీ సినిమాని మొదటి సినిమాలాగే ఫీలై అంతే కష్టపడి చెయ్యాలని అంది సమంత. దూకుడు సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత హైదరాబాద్ లోని ఓ మెబైల్ షోరూం లో సందడి చేసింది. ఆ సినిమా తనకు మంచి ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చెప్పారు. తెలుగు ప్రజలకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో మరోమారు నటిస్తున్నట్టు చెప్పారు.
ఇక ఎన్టీఆర్ గురించి చెప్తూ అతనూ గొప్ప నటుడే కాక మంచి హ్యూమన్ బీయింగ్ అంది. అతనితో మళ్లి చేయాలని కోరుకుంటున్నాను అంది. ఇక తను పనిచేసిన ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్యలు ఫేవరెట్ స్టార్సే అయనప్పటికీ నాగచైతన్యే నాకు బాగా క్లోజ్ అంది. ఇక దూకుడులోని తన పాత్రను తాను చాలా ఎంజాయ్ చేసానని చెప్పింది. నాకు షూటింగ్ మొదటి రోజు నుంచి తెలుసు దూకుడు చిత్రం మొత్తం మహేష్ కేంద్రంగా జరిగే కథ అని అందుకే ఏ సమస్యా రాలేదు అంది. ఇక దూకుడులో ఆమె పాత్ర కేవలం డాన్స్ లకే పరిమితం అవుతుంది. సెకెండాఫ్ లో పాత్ర నిడివి తగ్గిపోతుంది. ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా ఈగ అనే చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











