తేరుకోవటానికి రెండు రోజులు పట్టింది...సమంత
ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటు కలుగుతోంది అంటూ సమంత తనకు టర్కీలో జరిగిన అనుభవాలు చెప్పుకొచ్చింది. మహేష్ తో చేస్తున్న దూకుడు చిత్రం కోసం ఆమె టర్కీ వెళ్ళవలిసి వచ్చింది. ఆమె ఈ విషయాలను మీడియాతో ప్రస్దావిస్తూ...ఓ రోజు నాతో షూటింగ్ పార్ట్ లేకపోవడంతో నా మేకప్ కిట్ కొనుగోలు కోసం నా పర్సనల్ మేకప్‌మేన్, హెయిర్ స్టయిలిస్ట్‌లతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో షాపింగ్‌కు వెళ్లాను. షాపింగ్ అంతా అయిపోయాక కారెక్కేందుకు రోడ్డుమీదకు వచ్చాను. సరిగ్గా అదే సమయంలో రోడ్డుకు అవతల పెద్ద బాంబు పేలుడు నా కళ్లెదురుగానే సంభవించింది. చూస్తుండగానే 15 నుంచి 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ సంఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. తేరుకోవడానికి రెండు రోజులు పట్టింది. వెంటనే షూటింగ్‌లో వాళ్లు కంగారుపడిపోయారు. మాకేం కాలేదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు అంది.


Click it and Unblock the Notifications











