Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ సినిమాలో ఏర్పడ్డ పరిచయం ఈ సినిమాతో వర్కౌట్ అవుతోంది..?
'ఏ మాయ చేసావే' చిత్రం తర్వాత మళ్లీ నాగచైతన్య, సమంతా జంటగా నటిస్తున్నారు. వెన్నెల, ప్రస్థానం వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే 'ఆటో నగర్ సూర్య' సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో మేక్స్ ఇండియా బ్యానర్ పై ప్రేమకావాలి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన కె అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల కెమెరా స్విచాన్ చేయగా, చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు.
ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో కంటిన్యుస్ గా జరుగుతుంది. దీనికి అనూప్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ, చైతన్యతో మరోమారు హిట్ కొడ్తానని చెబుతోంది. ఏమాయ చేసావె" సినిమాలో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ చైతన్యతో బాగా కుదిరిందనీ, ఆ సినిమా టైమ్ లో చైతన్యతో ఏర్పడ్డ పరిచయం ఇప్పుడు 'ఆటోనగర్ సూర్య"కి బాగా వర్కవుట్ అవుతుందని చెబుతోంది. బ్రహ్మానందం, సాయికుమార్, జయవూపకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, అజయ్, వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్, సినిమాటోక్షిగఫీ: శ్రీకాంత్.