సమంత రాఖీ కడతానని బెదిరించింది: నాగ చైతన్య
సమంత గురించి చైతూ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ప్రేమించే సమయంలో తనను బెదిరించిన విషయాన్ని తెలిపారు.
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య-సమంత మరో నెల రోజుల్లో భార్యాభర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న గోవాలో వీరి వివాహం జరుగబోతోంది. ప్రస్తుతం నాగ చైతన్య తన తాజా మూవీ 'యుద్ధం శరణం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
సెప్టెంబర్ 8న 'యుద్ధం శరణం' విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత చైతు పెళ్లికి సంబంధించి వ్యవహారాల్లో మునిగిపోనున్నాడు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

అపుడు అమ్మతో, ఇపుడు సమంతతో యుద్ధం
‘యుద్ధం శరణం' సినిమాలో మాదిరి రియల్ లైఫ్ లో అంత పెద్ద యుద్ధాలేమీ చేయలేదని..... అయితే స్కూలుకు వెళ్లే రోజుల్లో అమ్మతో, ప్రేమలో ఉన్న సమయంలో సమంతతో చిన్న చిన్న యుద్ధాలు చేయాల్సి వచ్చిందన్నారు.
Recommended Video


సమంత బెదిరించింది
మేము ప్రేమలో ఉన్న సమయంలో.... మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పలేదంటే నేను నీకు రాఖీ కట్టేయాల్సి వస్తుందని సమంత తనను బెదిరించేదని చైతు తెలిపారు.

ఇపుడెలాంటి యుద్ధాల్లేవు
ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి యుద్ధాల్లేవని, ఇద్దరి మధ్య ప్రతి విషయంలో మంచి అండర్ స్టాండింగ్ ఉంటుందని, అదే తమ మధ్య రిలేషన్ ను ఇంత దూరం తీసుకొచ్చిందని చైతు తెలిపారు.

యుద్ధం శరణం
యుద్ధం శరణంలో చైతు, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు. శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.


Click it and Unblock the Notifications











