twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘రభస’లో సమంత ట్రెడిషనల్ లుక్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతానికి 'రభస' అనే పేరు ప్రచారంలో ఉంది. సమంత, ప్రణీత హీరోయిన్లు.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సమంత ట్రెడిషనల్ లుక్ ఫోటో ఒకటి సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ సమంత ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసాడు. ఈ ఫోటో చూస్తుంటే సమంత ఈ చిత్రంలో మరోసారి తన గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తుందని స్పష్టమవుతోంది.

    సినిమాలో హీరో ఎన్టీఆర్ కోసం.... సమంత, ప్రణీతలు ఎప్పుడూ గొడవ పడుతుంటారట. ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    
 Music director S.SThaman has clicked his image of Samantha during the shooting of Rhabasa and posted it his Facebook page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X