»   » 'ఆ వార్తలు అబద్ధం' ..సమంత ఖండన

'ఆ వార్తలు అబద్ధం' ..సమంత ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Samantha
హైదరాబాద్ :ఆ హీరోకి ప్రమాదం జరిగిందట... ఫలానా హీరోయిన్‌కి ఆరోగ్యం బాగా లేదట... అంటూ ఈ మధ్య రూమర్స్ తెగ షికారు చేస్తున్నాయి. ఇటీవల సమంత పైనా ఇలాగే వదంతులు వచ్చాయి. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైందంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లలోనూ, తర్వాత మీడియాలోనూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ వార్తల్ని ఆమె ట్విట్టర్‌లో ఖండించారు.

''నేను బాగానే ఉన్నా. నా అనారోగ్యం వార్తలు అబద్ధం. నేనెప్పుడూ నా సినిమాలకు సంబంధించిన షెడ్యూల్స్‌ని ట్విట్టర్‌లో అప్‌డేట్‌ చేయలేదు. అయితే ఈ సారి తప్పడం లేదు. నేనేం చేస్తున్నానో అభిమానులకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 20 వరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా, వి.వి.వినాయక్‌ సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటాను. 23 నుంచి జనవరి 4 వరకు లింగుస్వామి-సూర్య సినిమాలో నటిస్తాను'' అంటూ ట్వీట్‌ చేసింది సమంత.


ప్రస్తుతం సమంత పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం', సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక తెలుగులో సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో సమంత నటించనుంది.

English summary
Samantha Ruth Prabhu tweeted:I usually don't tweet my detailed shoot schedule. I'm just doing it because some gossip rags are reporting that I am seriously ill. Enough....Shooting for Jr. Ntr's film and VV Vinayak's film till 20th dec. then from 23rd dec till jan 4th for the Lingusamy-Suriya film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu