బర్త్ డే స్పెషల్: హీరోయిన్ సమంత చిన్న నాటి ఫోటోలు

By Bojja Kumar

హైదరాబాద్ : సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రస్తుతం సౌత్ లో వరుస అవకాశాలతో దూసుకెలుతుతోంది.

'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఈ రోజు సమంత పుట్టినరోజు. 29 వ వసతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా సమంతకు పుట్టినరోజు విషెస్ చెబుతూ సమంత సినీ, ఫ్యామిలీ విషయాలపై ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం సమంత తెలుగులో నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ' చిత్రం, ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనతాగ్యారేజ్' చిత్రంలో చేస్తోంది. దీంతో పాటు ఆమె సూర్యతో చేసిన '24' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో సమంత ఒకరు. అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు తప్ప మామూలు వాళ్లకి అందుకునే రేంజిలో లేదు ఈ చెన్నై బ్యూటీ. స్లైడ్ షోలో సమంత చిన్ననాటి ఫోటోలు, ఫ్యామిలీ డీటేల్స్...

సమంత

సమంత


సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

స్టడీ..

స్టడీ..


సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

ఫ్యామిలీ

ఫ్యామిలీ


సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

తెరంగ్రేటం

తెరంగ్రేటం


ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెలుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X