»   »  సమంతలో మార్పు: యావరేజ్ నుంచి సెక్సీగా..!(ఫోటోలు)

సమంతలో మార్పు: యావరేజ్ నుంచి సెక్సీగా..!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సమంత...ప్రస్తుతం సౌతిండియాలోని టాప్ హీరోయిన్‍‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న హీరోయిన్. 2010లో 'ఏ మాయ చేసావె' చిత్రం ద్వారా సినిమాల్లోకి తెరంగ్రేటం చేసిన సమంత ఆ సినిమా విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళం బాషల్లో దాదాపు 15 పైగా సినిమాలు చేసింది. దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. దీంతో సమంత లక్కీ హీరోయిన్ గా మారి పోయింది. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఆమె ఉంటేనే సినిమా చేస్తాం అనే పరిస్థితి తయారైంది.

సమంత అంటే ఇపుడు అభిమానులకు ఆరాధ్య దేవత. తన అందాలకు మెరుగులు దిద్దుకుంటూ రోజు రోజుకు మరింత సెక్సీగా తయారవుతున్న ఆమెను శృంగార దేవతగా ఆరాధిస్తున్నవారు ఉన్నారు. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో, సినిమాల్లోకి రాక ముందు సమంత ఇంత సెక్సీగా ఉండేది కాదనేది ఆమెను సుధీర్ఘ కాలంగా పరిశీలిస్తున్న వారి అభిప్రాయం.

సినిమాల్లోకి వచ్చిన తర్వాతే సమంత తన ఫిగర్‌ను మరింత అందంగా తయారు చేసుకోవడానికి చాలా కష్టపడినట్లు స్పష్టం అవుతోంది. తన రూపాన్ని యావరేజ్ స్థాయి నుంచి సెక్సీగా తయారు చేసుకుందనేది స్లైడ్ షోలో ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది. ఆ ఫోటోలు చూస్తూ....సమంతకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

సమంత సెక్సీ లుక్

సమంత సెక్సీ లుక్


వావ్...సమంత ఈ ఫోటోలో ఎంతో సెక్సీగా ఉంది కదూ. ఇది సమంత లేటెస్టు ఫోటో. అయితే ఆమె సినిమాల్లోకి రాక ముందు ఎంత యావరేజ్‌గా ఉందో పక్క స్లైడ్లో ఓ లుక్కేయండి.

సమంత యావరేజ్ లుక్

సమంత యావరేజ్ లుక్


చూసారుగా...ఈ ఫోటోలో సమంత రూపం ఎంత యావరేజ్‌గా ఉందో..! సినిమాల్లోకి రాకముందు సమంత మోడలింగ్ రంగంలో కొనసాగింది. ఈ ఫోటో అప్పటిదే...

సమంత

సమంత


సమంత 1987, ఏప్రిల్ 28న మళయాలి మదర్, తెలుగు ఫాదర్‌కు జన్మించింది. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

చదువులు

చదువులు


సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

కుటుంబం

కుటుంబం


సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

సినిమాలు

సినిమాలు


ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత ఈమూడు సంవత్సరాల్లో దాదాపు 15కు పైగా చిత్రాల్లో నటించింది.

తెలుగు

తెలుగు


సమంత తెలుగు చిత్రాలు ఏమాయ చేసేవె, బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఆమె చివరి సినిమా అత్తారింటికి దారేది తెలుగు సినిమా చరిత్రలోనే నెం.1 చిత్రంగా నిలిచింది.

బాలీవుడ్

బాలీవుడ్


ఏక్ దివానా థా చిత్రంలో గెస్ట్ రోల్ చేయడం ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయిన సమంత, Assi Nabbe Poorey Sau అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ అరంగ్రేటం చేసేందుకు రెడీ అవుతోంది.

అవార్డులు

అవార్డులు


సమంత ఇప్పటి వరకు అనేక అవార్డులు గెలుచుకుంది. రెండు సినీ‘మా' అవార్డు, రెండు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఒక నంది అవార్డు, రెండు టీఎస్ఆర్ టీవీ9 ఫిల్మ్ అవార్డులు సొంతం చేసుకుంది.

బాయ్ ఫ్రెండ్

బాయ్ ఫ్రెండ్


సమంత ఓ సారి మీడియాతో మాట్లాడుతూ... తన పర్సనల్ లైఫ్ గురించి చర్చించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం ఒప్పేసుకుంది. ‘అవును నేను ప్రేమలో ఉన్నాను' అని వ్యాఖ్యానించింది. అయితే తన ప్రియుడు ఎవరనే విషయం బయట పెట్టడానికి మాత్రం సమంత నిరాకరించింది. తన ప్రేమ వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ మ్యాటరని, దాని గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మరో మూడు సంవత్సరాల తర్వాత అని వెల్లడించింది.

చిన్నతనంలో సమంత

చిన్నతనంలో సమంత


మీరు ఇపుడు చూస్తున్నది సమంత చిన్నతనంలోని ఫోటో...

English summary
Samantha turns average to sexy figure. Samantha Ruth Prabhu is an Indian film actress and model, who mainly works in the Telugu and Tamil film industries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu