బెట్ కడతాను అంటూ హీరోయిన్ సమంత సవాల్
హైదరాబాద్: లింగస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత "అంజాన్" అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో సూర్య ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా కనబడతారని తెలుస్తోంది. ఈ సినిమా మీద సూర్య ఫ్యాన్స్ కు భారీ అంచనాలు వున్నాయని టాక్. సమంతతో మొదటిసారి జోడీ కడుతున్నాడు సూర్య.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగిసింది. ఈనేపథ్యంలో హీరోయిన్ ట్విట్టర్ ద్వారా తన అనుభవాలను పంచుకున్నారు. "నేను ఇంత వరకు పనిచేసిన వ్యక్తుల్లో ది బెస్ట్ టీమ్ 'అంజాన్' టీమ్. చాలా నైస్ టీమ్. కావాలంటే ఈ విషయంలో ఎవరితోనైనా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా కంఫర్టబుల్‌గా పనిచేయడానికి సహాయ పడ్డారు. లవ్ యు'' అని ట్వీట్ చేసారు.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











