»   » అనుభవం: రియల్లీ హాట్ అంటూ సమంత ట్వీట్

అనుభవం: రియల్లీ హాట్ అంటూ సమంత ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మధ్య సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సమంత తరచూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు సాదా సీదాగా, కొన్ని సార్లు ఆసక్తికరంగా, మరికొన్ని సార్లు వివాదాస్పదంగా ట్వీట్స్ చేస్తూ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా సమంత చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం సమంత సూర్య హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న 'అంజాన్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రం షూటింగ్ మహారాష్ట్రలోని ఫేమస్ హిల్ స్టేషన్ పాంచ్‌గానీ‌లో జరుగుతోంది. ఇక్కడ షూటింగ్ ముగియడంతో సమంత తన అనుభవాలను ట్వీట్ రూపంలో వెల్లడించింది.

'పాంచ్‌గానిలో నా షెడ్యూల్ ముగిసింది. బై బై పాంచ్‌గాని! అంజాన్ సినిమా కోసం హై ఎనర్జీ డాన్స్ నంబర్ చిత్రీకరణ జరిగింది. బ్యాగ్రౌండ్ డాన్సర్స్ చాలా గ్రేట్...వారికి గొడుగులు లేవు, ఫ్యాన్సీ కారావాన్స్ లేవు, జ్యూసులు లేవు. ఇక్కడ వాతావరణం రియల్లీ హాట్...యు గైస్ రాక్' అంటూ సమంత ట్వీట్ చేసింది.

సమంత సినిమా విషయానికొస్తే.....తెలుగులో ఆమె నటించిన 'ఆటో నగర్ సూర్య', 'మనం' చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు మరో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. అంజాన్ సినిమా ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
"It's a schedule wrap for me. Bye bye Panchgani! Shot a high energy dance number for Anjaan. So much respect for the background dancers...No Umbrellas, No Fancy Caravans, No Juice. And it was Hot...Really Hot...You Guys Rock," Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu