»   » సినిమా విషయాలను ఎక్స్ ఫోజ్ చేస్తున్న సమంత, దీపిక పదుకొనెపై కామెంట్స్!

సినిమా విషయాలను ఎక్స్ ఫోజ్ చేస్తున్న సమంత, దీపిక పదుకొనెపై కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో హీరోయిన్ల మధ్య ఏ రేంజిలో పోటీ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకరిని డామినేట్ చేద్దామని మరొకరు ప్రయత్నిస్తుంటారు. ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకునే సందర్భాల్లు చాలా అరుదనే చెప్పాలి. ఒక వేళ హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ఉన్నా....వారి స్థాయి వేర్వేరుగా ఉంటుంది. ఒకే రేంజిలో ఉన్న స్టార్ హీరోయిన్ల మధ్య సత్సంబంధాలు ఉండటం చాలా అరుదు. ఒక స్టార్ హీరోయిన్ మరొక స్టార్ హీరోయిన్‌ను పొగడటం అత్యంత అరుదు.

అయితే సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత మాత్రం...ఇందుకు పూర్తి భిన్నం. అందరితోనూ కలివిడిగా ఉండటం, తన మనసులోని భావనలను ఓపెన్‌గా చెప్పడం ఆమె స్టైల్. తాజాగా సమంత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెను ఉద్దేశించి తన ట్విట్టర్లో కామెంట్స్ చేసింది. దీపిక పదుకొనె ఏం చేసినా, ఏం మాట్లాడినా పర్‌ఫెక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించింది.

ఒక స్టార్ హీరోయిన్ మరొక స్టార్ హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యమే మరి. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా 'గబ్బర్ సింగ్-2' రేసులో ఉన్నవారే. ఒక రకంగా సమంతకు దీపిక పొటీ దారు అని చెప్పొచ్చు. అయినప్పటికీ అవేవీ మనసులో పెట్టుకోకుండా సమంత మాట్లాడటం గమనార్హం.

ప్రస్తుతం సమంత నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రం షూటింగ్ ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది. డిసెంబర్లో ఈ చిత్రం రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుందంటూ సమంత తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గతంలో అత్తారింటికి దారేది చిత్రం విశేషాలను కూడా సమంతే మొదటగా తన ట్విట్టర్ ద్వారా ఎక్స్ ఫోజ్ చేసింది. సాధారణంగా సినిమాలకు సంబంధించిన వివరాలు హీరోయిన్ల ద్వారా అస్సలు బయటకు రావు, కానీ సమంత మాత్రం అందుకు భిన్నం. ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ముఖ్య వివరాలు ఆమె ద్వారానే బయటకు ఎక్స్ ఫోజ్ అవుతుండటం గమనార్హం.

English summary
"Back on the sets of Autonagar surya... All set for a December release. I haven't been in absolute awe of an actress in a while... But Deepika padukone... Sigh... Perfection" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu