ఆ విషయం మాత్రం ఎత్తొద్దు, స్ట్రిక్టుగా చెప్పేసిన సమంత, సో...

By Srikanya

హైదరాబాద్‌: స్లాంగ్ మారితే కానీ వర్కవుట్ అయ్యేటట్లు లేదు అంటూ రీసెంట్ గా వచ్చిన బ్రహ్మోత్సవంలో డైలాగు చెప్పి అదరకొట్టిన సమంత, నిజ జీవితంలో ప్రేమ విషయంలో తనకు వ ర్కవుట్ అయ్యిందని చెప్పి సమస్యలో పడింది.

సమంత త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి. . ''పెళ్ళి స్టేజ్ వచ్చేసింది.. ఇప్పుడింక పెళ్ళి, పిల్లలతో సెటిల్ అవ్వాలనుకుంటున్నా'' అని ఓ మీడియా వారికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ చెన్నై చిన్నది.

దాంతో ఓ తెలుగు ఆమె ఓ టాలీవుడ్‌ హీరోతో ప్రేమలో ఉందని, త్వరలో వీరి పెళ్లి బాజాలు మోగనున్నాయని రకరకాలుగా రాశారు. దీనిపై సమంత తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందించారు. తాను చెప్పే వరకు పెళ్లి మాట ఎత్తొద్దని కోరుతూ.. ట్వీట్‌ చేశారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత జంటగా నటించిన 'అ..ఆ: అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' చిత్రం జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఆ ఇంటర్వూలో కొన్నేళ్ళుగా ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్న సమంత అతడెవరో తెలుసుకునేందుకు ఇంకొన్ని నెలలు ఓపిక పట్టాలని సమాధానమిస్తోంది. వీరి ప్రేమకు ఇరువర్గాల కుటుంబీకులు మద్దతు తెలిపారట. ఇక ' పెళ్లి మేళం' వాయించడమే ఆలస్యం అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

అంతేనా ''చాలా సంవత్సరాలుగా అతడు పరిచయం. అతడు గరిట పట్టాడంటే నలభీమపాకమే. నాన్‌వెజ్ అయితే అదుర్స్ అంతే. నాకేమో తినడం మాత్రమే వచ్చు. అతడు వండిపెడితే తినడానికి చాలా సిగ్గుగా ఉంటుంది. అందుకే సినిమాల నుండి బ్రేక్ తీసుకుని వంటల్లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నా.

ఎమోషన్ ఏదైనా నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతాను. తను నాకు పూర్తి వ్యతిరేకం. ఆలోచించి మాట్లాడతాడు, పేషెన్స్‌తో ఉంటాడు. హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే. అదే లేకపోతే అతడిని లవ్ చేసేదాన్ని కాదేమో'' అంటూ చెప్పేసింది. అంతకుముందు ఓసారి లవ్ ట్రాక్ ఎక్కినపుడు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సమంత ఈసారెందుకు ఇంత గోప్యంగా ఉంచుతున్నారంటే..? ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే అలా చేయదలేదని చెబుతోంది.

రైటై సమంత..నువ్వు నీ పెళ్లి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఈ రేంజిలో ఇచ్చినప్పుడు మీడియా వాళ్లు నీ గురించి రాయకుండా ఎలా ఉండగలరు. హౌ.. చెప్పమ్మా.. అలాగే ట్విట్టర్ లో కూడా నిన్ను ఫ్యాన్స్ ట్వీట్స్ తో విషెష్ కూడా చెప్తారు..ప్రశ్నిస్తారు. తప్పదు కానీ ..మరి నీ రిక్వెస్ట్ విని మీడియా ఆగుతుందేమో కానీ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఆగుతారా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X