పవన్, ఎన్టీఆర్ అనుకుని పొరబడ్డారంటున్న సమంత

By Bojja Kumar

హైదరాబాద్: సమంత త్వరలో మరో మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సమంత ఆ మాట చెప్పడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె చేయబోయే ఆ మల్టీ స్టారర్ మూవీ ఎన్‌‍టి‌ఆర్-నాగార్జున కలిసి చేయనున్న సినిమా లేదా....పవన్ కళ్యాణ్-వెంకటేష్ కలిసి చేస్తున్న 'గోపాలా గోపాలా' అయి ఉంటుందనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

ఈ నేపథ్యంలో సమంత స్పందించింది. జూఎన్టీఆర్, నాగార్జున, పవన్ కళ్యాణ్ లాంటి వారితో మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని నాకు ఉంది. కానీ నేను చెప్పిన మల్టీ స్టారర్ సినిమా వాళ్లకి సంబంధించినవి కావు. అసలు సినిమా ఏంటనేది త్వరలో తెలియజేస్తాను అంటూ సమంత ట్వీట్ చేసింది.

సమంత క్లారిటీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్‌లో సందేహాలు తొలగాయి. అయితే ఆ సినిమా ఏమిటనే విషయాలు సమంత చెప్పక పోవడంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. సమంత చేస్తున్న ఇతర సినిమాల వివరాలు స్లైడ్ షోలో...

సమంత చేస్తున్న సినిమాలు

సమంత చేస్తున్న సినిమాలు

సమంత ప్రస్తుతం తెలుగులో రభస, అల్లుడు శీను, ఆటోనగర్ సూర్య సినిమాల్లో నటిస్తుంటే తమిళంలో అంజాన్, కత్తి సినిమాలో నటిస్తోంది.

ఆటో నగర్ సూర్య

ఆటో నగర్ సూర్య

నాగ చైతన్య, సమంత, జోడీగా దేవా కట్ట దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ‘ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

రభస

రభస

జూ ఎన్టీఆర్, సమంత జోడీగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రభస' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

అల్లుడు శ్రీను

అల్లుడు శ్రీను

మరో వైపు సమంత వివి వినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శ్రీను' సినిమా చేస్తోంది. ఈచిత్రం ద్వారా బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

తమిళ సినిమాలు

తమిళ సినిమాలు

ఇక తమిళంలో సమంత సూర్యకు జోడీగా ‘అంజాన్'చిత్రంలో, విజయ్‌కు జోడీగా ‘కత్తి' సినిమాలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X