మహేష్ బర్త్‌డే : బ్యాడ్‌న్యూస్ అంటూ సమంత ట్వీట్
హైదరాబాద్ : ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు తెలుపడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆయనతో పాటు రెండు చిత్రాల్లో హీరోయిన్ నటించిన సమంత.
'మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన వయసు పెరుగుతున్నకొద్దీ మరింత యవ్వనంగా తయారవుతున్నారు. ఇది ఒక రకంగా మా హీరోయిన్లకు బ్యాడ్ న్యూసే' అంటూ సమంత ట్వీట్ చేసింది. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే మహేష్ బాబు గ్లామర్ చూసి అసూయ ఫీలవుతున్నట్లు స్పష్టం అవుతోంది.
ఆ విషయాన్ని పక్కన పెడితే...సమంత మహేష్ బాబు నటించే 'ఆగడు' సినిమాలో ఐటం సాంగు చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సమంతతో ఐటం సాంగు చేయించడం ద్వారా సినిమాకు మంచి క్రేజ్ వస్తుందనే ప్లాన్ చేసారు. ఈ విషయమై ఇప్పటికే సమంతతో కూడా చర్చించారట.
అయితే సమంత నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని, ఐటం సాంగు చేయాలా? వద్దా? అనే దానిపై ఆమె త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల బాలీవుడ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ఐటం సాంగు చేయడం సర్వసాధారణం అయింది. ఈ ట్రెండును టాలీవుడ్లో ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











