»   » పవన్-త్రివిక్రమ్ మూవీ ట్యాగ్‌లైన్‌పై సమంత ట్వీట్

పవన్-త్రివిక్రమ్ మూవీ ట్యాగ్‌లైన్‌పై సమంత ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ సమంత పవన్ కళ్యాణ్ సినిమా-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. ఈ చిత్రానికి 'మాటలతో మాయ' అనే ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుంది అని ట్వీట్ చేసింది. అంటే రచయితగా త్రివిక్రమ్ ఆమెను ఎంతో ఇంప్రెస్ చేసాడో సమంత మాటలను బట్టి స్పష్టమవుతోంది.

గతంలో 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ అంటూ సమంతనే ట్విట్టర్ ద్వారా చెప్పింది. అయితే తేలిన విషయం ఏమిటంటే..... ఆ తర్వాత అది కేవలం వర్కింగ్ టైటిలే అని, త్వరలో ఫైనల్ టైటిల్ ప్రకటిస్తారని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ నిమిత్తం నెలరోజుల క్రితం యూరప్ వెళ్లిన పవన్ షెడ్యూల్ ముగియడంతో మంగళవారం తెల్లవారు ఝామున హైదరాబాద్ తిరిగి వచ్చారు. 

యూరప్ షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణతో పాటు, కొన్ని సీన్స్ షూట్ చేసారు. స్పెయిన్‌లోని ఐస్‌లాండ్‌లో పవన్ కళ్యాణ్, వంశీ(ఒక విచిత్రం హీరో)లపై ప్రత్యేకమైన ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా చాపర్లను వాడారు. ఈ ఫైట్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు.

ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
"The tagline of the pawan-Trivikram film should be maatalatho maaya...Trivikram my respect..." Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu