»   » సేవా కార్యక్రమాల్లో సమంత ముందడుగు

సేవా కార్యక్రమాల్లో సమంత ముందడుగు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో బాగా డబ్బులు వేనకేసుకోవడం మాత్రమే కాదు.....తన సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ, అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తోంది ప్రముఖ హీరోయిన్ సమంత.

తాజాగా సమంత 'ప్రత్యూష పౌడేషన్' తరుపున సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నారు. పిల్లలు, మహిళ సాధికారత కోసం ఈ ఆర్గనైజేషన్ పని చేస్తోంది. ఇందుకోసం నిధులు సేకరించే పనిలో ఉంది సమంత.

Will be planning an auction soon... Of garments worn by me at audio releases, award functions and from my films.. Further details soon
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 8, 2013

Think it's time for pratyusha to grow... Have a sincere group of young awesome ppl with me.. Talking to more sponsors.. Really really happy
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 8, 2013

For ppl who still don't know... Pratyusha is a charity organisation.. Especially for children and women.. Through Andhra Pradesh...
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 8, 2013

ఇందులో భాగంగా సినిమాల్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా వచ్చిన డబ్బులను ప్రత్యూష ఫౌండేషన్‌ తరుపున జరిగే సేవా కార్యక్రమాల్లో వినియోగిస్తారట. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా వెల్లడించింది.

'త్వరలో వేలం కార్యక్రమం జరుపబోతున్నాం. సినిమాల్లో నేను వేసుకున్న వస్త్రాలను వేలం వేస్తాం. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తాను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లల సాధికరత కోసం పని చేస్తున్న 'ప్రత్యూష' చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా' అని సమంత ట్వీట్ చేసింది. ఇతర స్టార్లకు సంబంధించిన వస్తువులను కూడా ఈ చారిటీ కార్యక్రమం కోసం వేలంలో అందుబాటులోకి తెస్తాం అంటోంది సమంత.

English summary
“Will be planning an auction soon… Of garments worn by me at audio releases, award functions and from my films.. Further details soon. Pratyusha is a charity organisation.. Especially for children and women.. Through Andhra Pradesh…”, she tweeted.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu