కేకలేసింది, నవ్వింది, అంతలోనే ఏడ్చింది: సమంతకు ఏమైంది?
హైదరాబాద్: ప్రేమమ్ మూవీ విడుదలై రిజల్ట్ పాజిటివ్ గా వచ్చిన తర్వాత హీరోయిన్ సమంత ఆనందానికి అవధులు లేకుండా పోయింది, సినిమా ఉదయం ఆటకే సూపర్ హిట్ టాక్ రావడంతో ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేసింది.
'మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కేకలేస్తామో, ఏడుస్తామో, నవ్వుతామో, గెంతులేస్తామో తెలియదు. నేను మాత్రం అవన్నీ చేసేస్తున్నా' అని ట్వీటింది సమంత. కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నాగ చైతన్య, సమంత వచ్చే త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

నాగ చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన 'ప్రేమమ్' చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది.
'మలర్ ' మిస్సైంది కానీ...మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది (చైతూ 'ప్రేమమ్'రివ్యూ )
మలయాళ హిట్ మూవీకి రీమేక్ కావడం..... తెలుగులో ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ఆడియో జనాలకు ఇప్పటికే బాగా నచ్చడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు మార్నింగ్ షో నుండే ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆయడిన్స్ అభిప్రాయాలతో పాటు రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో అంతా సంతోషంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











