సంచలనం రేపుతున్న కంగనా రనౌత్ వీడియో...... సమంత ట్వీట్!
కంగనా నౌత్ బాలీవుడ్ దివా సాంగ్ సంచలనం అయింది. ఇందులో నేను యోని కలిగి ఉన్నాను... అంటూ లిరిక్స్ ఉన్నాయి.
Recommended Video

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ఏఐబి(ఆల్ ఇండియా బాక్‌చూద్)తో కలిసి చేసిన 'బాలీవడ్ దివా' సాంగ్ సంచలనం రేపుతోంది. హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వీడియో సాంగ్ విడుదలైన ఒకరోజులోనే ఇంటర్నెట్ లో సంచలనం అయింది.
ఈ పాట.... 'Cause I Have Vagina Re' (నేను యోని కలిగి ఉండటానికి కారణం ఉంది) అంటూ సాగే పదాలు లిరిక్స్ ఉన్నాయి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ కొనసాగుతున్న నెపోటిజమ్, సెక్సిజమ్, మహిళల పట్ల ఆక్షపణ లాంటి అంశాలను గుర్తు చేస్తూ ఒక సెటైరిక్‌గా ఈ పాటను చిత్రీకరించారు.
సమానత్వం లేక పోవడంపై పంచ్
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ హీరోలు, హీరోయిన్లను సమానంగా చూడటం లేదు, హీరోలను ఒకరకంగా, హీరోయిన్లను మరొక రకంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఈ వీడియో సాంగులో స్పష్టంగా చూపించారు.

సంచలన రిలిక్స్
'Cause I Have Vagina Re' (నేను యోని కలిగి ఉండటానికి కారణం ఉంది) అంటూ సంచలనాత్మకంగా ఈ సాంగులో లిరిక్స్ వాడటం హాట్ టాపిక్ అయింది.

కంగనాకు మాత్రమే సాధ్యం
ఈ పాట చూసిన చాలా మంది కంగనాకు మాత్రమే ఇలాంటి సాధ్యం అవుతాయి. ఆమె మాత్రమే ఇలాంటివి చేయగలదు, బాలీవుడ్ స్టార్ల మీద సైతం సెటైర్లు వేయగలదు అని చర్చించుకుంటున్నారు.

ఈ పాట నేను రాయలేదు, నా ఐడియా కాదు
‘బాలీవుడ్ సాంగ్ దివా' చివర్లో.... కంగనా మాట్లాడుతూ తాను నటించిన ‘సిమ్రన్' చిత్రం సెప్టెంబర్ 15న విడుదలవుతోందని, ఈ పాటతో పాటు సినిమాను ఆదరించాలని కోరారు. ఈ పాటను తాను రాయలేదని, అసలు ఈ పాట తన ఐడియా కాదని కంగనా తెలిపారు.

ప్రమోషన్ కోసమే వివాదాలు
హీరోయిన్ కంగనా రనౌత్ తన తాజా సినిమా ‘సిమ్రన్' ప్రమోషన్ కోసమే ఈ వివాదాస్పద సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ కోసమే ఇటీవల ఆమె మీడియా ముందు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత సపోర్ట్
ఈ సెటైరిక్ సాంగ్ హీరోయిన్ సమంతకు బాగా నచ్చినట్లుంది. కంగనా రనౌత్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ఆమె ఓ లెజెండరీ ప్రశంసించింది. భయం అంటూ లేని ఓ ముఖం ఉంటే అది కంగనా రనౌత్ అంటూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











