»   »  తల్లడిల్లి పోతున్న సమంత, నా వల్ల కాదంటూ ట్వీట్!

తల్లడిల్లి పోతున్న సమంత, నా వల్ల కాదంటూ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Samantha
హైదరాబాద్: అనారోగ్యం పాలైనపుడు ఎంత బాధగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది తిన్నా నోరు రుచించదు...ఇలాంటి సమయంలో చేదు మందులు వరుస పెట్టి మింగడం అంటే? అబ్బో ఆ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. సామాన్య జనాలకైనా...సినిమా స్టార్లకయినా ఇలాంటి పరిస్థితి ఒకే‌లా ఉంటుంది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. అనారోగ్యంతో బాధ పడుతున్నాను. వరుస పెట్టి మందులు మింగడం నా వల్ల కావడం లేదు. వెంటనే కోలుకుని తిరిగి వర్క్‌లో బిజీ అయిపోవాలని ఉంది. కానీ శరీరం సహకరించడం లేదంటూ అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. పాపం సమంత అలా తల్లడిల్లి పోతున్న విషయం తెసుకుని అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

ప్రస్తుతం సమంత పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమంత నటించిన మరో చిత్రం 'ఆటో నగర్ సూర్య' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం', సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక తెలుగులో సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో సమంత నటించనుంది.

English summary

 "Meds meds meds.. Hate being sick.. Down for a few days..can't wait to go back to work. Can't work, can't workout, can't sleep...depressing" Samantha tweeted about her sickness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X