ఆటోలో సమంత.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో రాబోతోంది!
అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం పట్టిందల్లా బంగారంగా మారుతోంది. ఇటీవల సమంత నటించిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన మహానటి చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. తమిళంలో విశాల్ సరసన నటించిన చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడుగా రాబోతోంది.
ఇదిలా ఉండగా సమంత యూ టర్న్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. కన్నడ చిత్రానికి ఇది రీమేక్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబందించిన స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

కాగా మహానటి చిత్రంలో సమంత మధురవాణి పాత్రలో నటించింది. సమంత నటనకు అంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రంగస్థలం, మహానటి చిత్రాలతో ఘనవిజయాలు సొంతం చేసుకున్న సమంత త్వరలో యూ టర్న్ తో పలకరించబోతోంది.


Click it and Unblock the Notifications











