సమంత, నాగచైతన్య బిగ్‌ఫైట్.. కారణమేమిటో తెలుసా?
Recommended Video

దక్షిణాదిలో హాటెస్ట్ జంట సమంత, నాగచైతన్య మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైంది. సమంత నటించిన యూటర్న్, నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్నది.
చైతూ, సమంత పెళ్లి తర్వాత వారిద్దరు నటించిన సినిమాలు ఒకే రోజున పోటాపోటిగా విడుదల కావడం చర్చనీయాంశమైంది. ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో అనే విషయంపై ఆసక్తి పెరిగింది.
ఇక మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు రూపొందింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించింది. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషించింది. పవర్ ఫుల్ అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి తన నటనతో కనువిందు చేయనున్నారు.

కన్నడలో ఘన విజయం సాధించిన యూటర్న్ చిత్రాన్ని రీమేక్‌గా అదేపేరుతో తెలుగులో రూపొందించారు. ఈ చిత్రంలో సమంతతోపాటు రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా, ఆది పినిశెట్టి తదితరులు నటించారు.
సమంతకు ఈ వినాయక చవితి డబుల్ ధమాకాగా మారింది. తమిళంలో యూటర్న్‌తో ఆమె నటించిన సీమరాజా కూడా విడుదల కానున్నది. ఈ చిత్రంలో శివకార్తీకేయన్ హీరోగా నటించారు.


Click it and Unblock the Notifications











