సమంతకు బంపర్ ఆఫర్: పవన్ సరసన అవకాశం
హైదరాబాద్: చేతిలో ఫుల్లుగా సినిమాలు ఉన్న కథానాయిక సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఎంపికయినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం సమంత తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. దాదాపు అన్నీ టాప్ డైరెక్టర్స్‌తోనే. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వంలో వస్తున్న సినిమాలో పవన్ సరసన ఎంపికయిందని తెలుస్తోంది.
తొలుత ఈ చిత్రానికి ఇలియానా పేరును పరిశీలించారు. అయితే ఆఖరుకు సమంత పేరు ఖరారు అయింది. త్వరలో అధికారికంగా సమంత పేరును ప్రకటించనున్నారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చింది. జల్సా కలెక్షన్లను కురిపించింది. దీంతో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‌కు సమంత తోడు కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. వచ్చే నెల(నవంబర్)లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. వరుసగా పెద్ద హీరోలు, పెద్ద దర్శకుల చిత్రాల్లో నటిస్తూ హిట్స్ కొడుతున్న సమంతకు ఇది మరో బంపర్ అవకాశమనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











