Just In
Don't Miss!
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- News
SP Balu "భారత రత్నం" కాడా..? పద్మవిభూషణ్‌తో సరిపెట్టిన కేంద్రం
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిన్నతనంలో సమంత రూ. 1000 కోసం కష్టపడిన రోజులవి...(అరుదైన ఫోటోస్)
హైదరాబాద్: ప్రతి మనిషి జీవితంలో ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకరకంగా కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే! అలాంటివి లేకుండా దాదాపు ఏమనిషీ ఉండరేమో. ప్రస్తుతం సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ... కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమంత కూడా ఒకప్పుడు రూ. 1000 సంపాదించడానికి చాలా కష్టపడ్డరోజులు ఉన్నాయట. ఇటీవల ఇంటర్వ్యూలో సమంత ఇందుకు సంబంధించిన విషయాలు చెప్పుకొచ్చింది.
సమంత మాట్లాడుతూ నేను సినిమా రంగంలోకి వస్తాననిగానీ, ఈ స్థాయిలో ఉంటానని కానీ చిన్నతనంలో ఎప్పుడూ ఊహించుకోలేదు. ఇవన్నీ నా జీవితంలో అనుకోకుండా జరిగిన సంఘటనలే. నేను ఇప్పుడు ఇలా ఉన్నా తాను నడిచొచ్చిన దారిని మర్చిపోలేదని సమంత చెప్పుకొచ్చింది.
తన జీవితంలో ప్రతి స్టేజీలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఒక్కో అనుభవం తనను తాను జీవితంలో నిలదొక్కుకునేలా చేసాయి. ఒకానొక టైమ్ లో వెయ్యి రూపాయలు సంపాదించడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని సమంత తెలిపింది.
తన చిన్నతనంలో డబ్బు సంపాదించడానికి తాను పడ్డ పడ్డ కష్టం గురించి సమంత చెప్పి మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

14 ఏళ్ల వయసులో..
చిన్నతనం నుండే నా అవసరాల కోసం డబ్బు సంపాదించడం నేర్చుకున్నా..14 ఏళ్ల వయసులోనే చిన్న చితకా పనులు చేయడం మొదలు పెట్టాను అని సమంత తెలిపారు.

రూ. 1000 కోసం కష్టపడ్డ రోజులు...
పెళ్ళిళ్లు జరిగేటపుడు పన్నీరు జల్లే అమ్మాయిగా కూడా పని చేశా... మూడు గంటలు అలా నిలబడి పన్నీరు జల్లితే.. వెయ్యి రూపాయలు ఇచ్చేవారు అని చెప్పింది సమంత.

తన కష్టార్జితం..
సొంతగా సంపాదిస్తే తన కష్టార్జితం అనే ఫీలింగ్ అప్పట్లో ఎంతో బావుండేది సమంత తెలిపింది.

కోట్లు సంపాదిస్తున్నా..
ఇపుడు కోట్లు సంపాదిస్తున్నా ఆ వెయ్యి రూపాయలే గొప్పగా ఉన్నాయని...ఆ ఫీలింగ్ ఎప్పటికీ మరిచిపోలేనిదని సమంత తెలిపింది.

సమంత
సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

చదువు
సమంత తన పాఠశాల విద్యను టి నగర్లోని హోలీ ఏంజిల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేసింది. చెన్నయ్ లోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ పొందింది.

సమంత ఫ్యామిలీ
సమంత తనకంటే పెద్దవారైన ఇద్దరు సోదరులను కలిగి ఉంది. ఒకరి పేరు డేవిడ్, మరికొరి పేరు జోనథన్ ప్రభు. జోనతన్ మీడియా ఇండస్ట్రీలో పని చేస్తుండగా, డేవిడ్ బిపిఓ సెక్టార్లో పని చేస్తున్నాడు.

తెరంగ్రేటం
ఏమాయ చేసేవె చిత్రం ద్వారా 2010లో తెరంగ్రేటం చేసిన సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకెలుతోంది.

హిట్స్
ఒకప్పుడు సమంత అంటేనే హిట్ హీరోయిన్ అనే రేంజిలో పాపులర్ అయింది. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం భారీ విజయాలు సాధించిన సాధించిన చిత్రాలే ఉండటం విశేషం.

నాగ చైతన్యతో పెళ్లి
త్వరలో సమంత ఓ ఇంటిది కాబోతోంది. తెలుగు స్టార్ నాగ చైతన్యను పెళ్లాడబోతోంది.