చెమటోడుస్తూ...సెక్సీ ఫిజిక్‌తో సమంత (ఫోటో)
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో నెంబర్ వన్ హీరోయిన్ అంటే అంతా ముందుగా చెప్పే పేరు సమంత. తన అందం, అభినయం, సెక్సీ చేష్టలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది సమంత. దీనికి తోడు ఆమె నటించిన సినిమాలన్నీ హిట్టవుతుండటంతో లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది.
'ఏ మాయ చేసావే' సినిమా ద్వారా సమంత తెరంగ్రేటం చేసింది. వాస్తవానికి సమంత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇంత సెక్సీగా లేదనే చెప్పాలి. అయితే రాను రాను తన అందాలకు మెరుగులు దిద్దుకుంటూ....శరీర సౌష్టవాన్ని సెక్సీగా మార్చుకుని అందరినీ మంత్ర ముగ్దులను చేస్తోంది ఈ చెన్నై చిన్నది. సమంత జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ చెమటోడుస్తున్న దృశ్యం ఒకటి బయటకు వచ్చింది.
సమంత సినిమాల విషయానికొస్తే....ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్టయింది. మరో వైపు జూ ఎన్టీఆర్‌కు జోడీగా సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.
నాగ చైతన్యకు జోడీగా 'ఆటో నగర్ సూర్య' సినిమాతో పాటు అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం 'మనం'లో నటిస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్‌కు జోడీగా 'రభస' చిత్రంలో కూడా చేస్తోంది. అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యే సినిమాకు కూడా కమిట్ అయింది. దీంతో పాటు ఓ హిందీ, మరో తమిళ సినిమాకు సైన్ చేసింది.


Click it and Unblock the Notifications












