లవ్ మ్యాటర్..సతమతమవుతున్నా: సమంత
చేసింది ఒక్క చిత్రంతే అయినా సమంతకు ఫ్యాన్స్ నుంచి కంటిన్యూగా లవ్ లెటర్స్, ఈ మెయిల్స్ వచ్చేస్తున్నాయట. వీటికి రిప్లై ఎలా ఇవ్వాలో అర్ధం కాక సతమతమవుతున్నా అంటోంది సమంత. అలాగే తొలి సినిమా 'ఏ మాయ చేసావె' తోనే ఇంత పాప్యులార్టీ రావడానికి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడమే కారణం అని ఆనందంగా చెబుతోంది. ఇక సీన్ కట్ చేస్తే..సమంతకు లవ్ లెటర్స్..కాలేజ్ డేస్ లోనూ భీభత్సంగా వచ్చేవట. స్కూల్ డేస్ లో ఒకరు ప్రపోజ్ చేస్తే, కాలేజీలో చదివేటప్పుడు ఇద్దరు ప్రపోజ్ చేసారట. ఈ ప్రపోజల్స్ ని అంగీకరించిందా లేక బై చెప్పేసిందా అనేది మాత్రం చెప్పటం లేదు. స్టార్ అయ్యాక వచ్చే ప్రపోజల్స్ ఎక్కువే కాబట్టి, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో అర్ధంకావటం లేదంటోంది. ప్రస్తుతం సమంత..ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. అలాగే శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి ఆమె సైన్ చేసింది.


Click it and Unblock the Notifications











